• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టు వదలని పవన్ కళ్యాణ్

    AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు. Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws … Read more

    మణిపూర్ ఘటన అనాగరికం: కేటీఆర్

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికం. అయినా, ఈ భయానక హింసాకాండను చూస్తూ కేంద్రం మౌనంగా ఉంటోంది. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. We Indians were raging against Taliban when they … Read more

    BRS ఎమ్మెల్యేకు నిరసన సెగ

    డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నిరసన సెగ తగిలింది. రెడ్యా నాయక్ గో బ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఈ ఘటన కురవి మండలం బాలుతండాలో జరిగింది. ఊరి పొలిమేరల్లోనే ఎమ్మెల్యేను అడ్డుకుని ప్రశ్నించారు. తమ ఊరికి ఏం చేశావో చెప్పాలంటూ నిలదీశారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తమరు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలగజేసుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు నిరసన సెగ.. గో బ్యాక్ … Read more

    HYD: కేరళ గ్యాంగ్ హల్‌చల్

    హైదరాబాద్‌లో కేరళ గ్యాంగ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తులపై దాడి చేసి నగదుతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాంటి నేరాలకు పాల్పడ్డ నలుగురు నిందితులను దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల హిమాయత్ నగర్‌లోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేస్తున్న యువకుడిపై కేరళ గ్యాంగ్ దాడి చేసింది. పెప్పర్ స్ప్రే చల్లి అతడు డ్రా చేసిన డబ్బులు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. Pepper spray used to attack man … Read more

    ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

    తెలంగాణలోని ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలవాసులు ఆందోళనకు దిగారు. జేసీబీలకు అడ్డుపడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులను ఈడ్చుకుంటూ లాక్కెళ్తున్నారు. పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా గుడిసెలు తొలగిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓవరాక్షన్!

    తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బందితో సినిమా స్టైల్‌లో రీల్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రోహిత్ రెడ్డి కొద్దిరోజులుగా తాండూరులో యాగం చేస్తున్నారు. ఈ క్రమంలో యాగం చేస్తున్న సమయంలోనే తన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేశాడు. సినిమా స్టైల్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Reel by BRS Tandur MLA Pilot Rohit Reddy using govt … Read more

    భర్త రావట్లేదని భార్య క్షుద్రపూజలు

    TS: హైదరాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి భార్య క్షుద్ర పూజలు చేసింది. ఒక చోట చదును చేసి వెంట తెచ్చుకున్న వస్తువులను అక్కడ ఉంచిది భార్య హజీరా. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. దీంతో క్షుద్ర పూజలకు సహకరించిన బాబాను, హజీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలియడంతో అరెస్ట్ చేశారు. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ – కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి రావట్లేదని … Read more

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది. #WATCH | BRS MLC … Read more

    మంత్రి విడదల రజినీకి తీవ్ర అస్వస్థత!

    ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆస్పత్రి ప్రారంభోత్సవం చేస్తుండగా రజినీ అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపైనే అధికారులు ఆమెకు ఓఆర్ఎస్ ఇచ్చారు. సభలో మాట్లాడేందుకు ప్రయత్నించినా మంత్రి వల్ల కాలేదు. దీంతో ఆమె జగ్గయ్యపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడంతో రజినీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా రజనీకి అస్వస్థత #ysrcp #ycp #vidadalarajini #rajini #andhrapradesh #jaggayyapeta pic.twitter.com/KsecbeIeog — … Read more

    ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సాహసం

    ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సాహసం చేశారు. ఆయన గంటపాటు నీటిపై తేలియాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరంలోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో కోలగట్ల జలాసనం వేశారు. 64 ఏళ్ల వయసులో ఆయన ఏమాత్రం లెక్కచేయకుండా గంటపాటు నీటిపై తేలియాడి అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, స్పీకర్ తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.