• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BHOLASHANKAR: షికారుకు వచ్చిన షేర్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళాశంకర్’ మూవీ టీజర్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య 70ఎంఎంలో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ‘షికారుకు వచ్చిన షేర్‌ను బే’ అంటూ చిరు మాస్ డైలాగ్స్ పలికాడు. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    కంగన ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

    కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 24న సినిమాని రిలీజ్ చేయనున్నారు. భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. 1975 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించింది కంగన. ఇందిర పాత్రలో కంగన నటించింది. ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇందుకు దారితీసిన పరిణామాలను ఇందులో చూపించే అవకాశం ఉంది.

    ఆర్జీవీ వ్యూహం టీజర్ రిలీజ్

    ఏపీ రాజకీయాలపై రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ విడుదలైంది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంతో టీజర్ మొదలైంది. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని వర్మ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం వరకు ఒక పార్ట్, ప్రభుత్వ పాలన రెండో పార్ట్‌గా రానుంది. జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తున్నాడు. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

    ‘స్పై’ ట్రైలర్ వచ్చేసింది

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘స్పై’ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ సాయంత్రం మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్ యాక్టింగ్ అదరగొట్టాడనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

    పోలీసాఫీసర్‌గా రఫ్ఫాడిస్తున్న సత్యభామ

    కాజల్ బర్త్ డే సందర్భంగా తర్వాతి చిత్రం టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ‘సత్యభామ’గా వస్తోందీ గ్లామర్ బ్యూటీ. ఇందులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది. శ్రీకాంత్ డేగల డైరెక్షన్ వహించాడు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాను నిర్మించి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ని నిర్వహించారు.

    PUSPHA 2: లారీ ఫైట్ లీక్!

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఓ నదిలో ఎర్రచందనం దుంగలు ఉన్నలారీల మధ్య చేజింగ్ జరుగుతోంది. జీపుల్లో కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్‌లా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. #Pushpa2TheRule ???@alluarjun pic.twitter.com/wne5FhcEkX — అల్లుఅర్జున్ అన్న ?? (@AlluArjunCulttt) June 15, 2023

    సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టారు

    HYD: ఆదిపురుష్‌ సినిమా బాలేదన్న వ్యక్తిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ దాడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద యూట్యూబ్‌ ఛానళ్లకు బాధితుడు రివ్యూ చెబుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆచార్యలో గ్రాఫిక్స్‌ మధ్య చిరంజీవిని ఎలా చూశామో ప్రభాస్‌ను కూడా ఈ మూవీలో అలాగే చూపించారని బాధితుడు అన్నాడు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ తప్ప సినిమాలో మరేమి బాలేదన్నాడు. దీంతో తీవ్ర అగ్రహానికి లోనైనా ఫ్యాన్స్‌ అతడ్ని చితక్కొట్టారు. తప్పుడు రివ్యూ చెబుతున్నాడంటూ మండిపడ్డారు. ఆదిపురుష్ సినిమా బాలేదు అన్నందుకు కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్#Adipurush … Read more

    ఆదిపురుష్‌ వీక్షించిన వానరం

    ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో వానరం ప్రత్యక్షమైంది. ప్రేక్షకులతో పాటే కొద్దిసేపు సినిమాను వీక్షించింది. దీంతో హాలంతా ఒక్కసారిగా ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హనుమంతుడే వచ్చి సినిమా చూశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది ‌నిజంగా అద్భుతమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆంజనేయుడు కోసం థియేటర్లలో ప్రత్యేకంగా ఓ సీటును కేటాయిస్తున్నారు. Hanuman Jii watching Movie ???????JAI SRI RAM?#Adhipurush @PrabhasRaju @omraut jii you said for Hanuman Jii … Read more

    D50: స్టార్లతో ధనుష్ ఫిల్మ్.. రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘రాయన్’

    హీరో ధనుష్ 50వ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. బడా తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనుంది.  సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్, ధనుష్ సోదరీమణులు, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరాం, దసరా విజయన్, తదితరులు ఇందులో నటిస్తున్నారు.  ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.  ఫ్యామిలీ చుట్టూ తిరిగే రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు.  ఇందులో ధనుష్, సందీప్ కిషన్ అన్నదమ్ములుగా నటించనున్నారు. సందీప్‌కు జోడీగా అపర్ణను తీసుకున్నారు.  ధనుష్‌కి హీరోయిన్‌ని ఇంకా … Read more

    స్పై మూవీ నుంచి లిరికల్ వీడియో

    హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఝూమ్‌ ఝూమ్‌’ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్‌ 29న విడుదలకానుంది. https://youtube.com/watch?v=DtzAeCHqyqk%26t%3D22s