• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెండింగ్‌లో ‘ఏజెంట్’ ట్రైలర్

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. విడుదలైన 24 గంటల్లోపే దాదాపు 5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా ‘ఏజెంట్’ మూవీని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటించింది. హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.

    అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

    స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాతో అఖిల్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాకు వెళ్తుందని చిత్రబృందం పక్కా ధీమాతో ఉంది. మరి ట్రైలర్‌ చూశాక మీకు అదే అనిపిస్తే కామెంట్‌ చేయండి. 2020లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కరోనా కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది. 2021లో చిత్రాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగానే విడుదలవుతుంది. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ … Read more

    మంచు మనోజ్ వెడ్డింగ్ సాంగ్: వైరల్

    మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారి వివాహానికి సంబంధించిన అద్భుతమైన మూమెంట్స్‌ను ఓ పాట రూపంలో బంధించారు. ‘ఏం మనసో’ అంటూ సాగే ఈ పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. ఈ పాటలో పెళ్లి ప్రారంభం నుంచి వివాహం ముగిసేంత వరకు చోటుచేసుకున్న క్షణాలను చూపించారు. ఈ పాటను తన భార్య మౌనికారెడ్డికి అంకితం ఇస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అదిరిపోయిన ‘ఉగ్రం’ మేకింగ్ వీడియో

    అల్లరి నరేష్‌గా హీరోగా తెరకెక్కుతున్న ఉగ్రం సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉగ్రం చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం మే 5న థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    వేసవి కాలం వచ్చేసింది. కొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవలు వస్తాయి. పిల్లలు, పెద్దలు దొరికిన కాస్త సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఒకసారి అవెంటో తెలుసుకోండి. విరూపాక్ష సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విభిన్నమైన కథతో కార్తీక్ దండు తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి ఇది కచ్చితంగా … Read more

    ‘హనుమాన్‌’ వచ్చేస్తున్నాడు.. 11 భాషల్లో రిలీజ్

    యంగ్‌ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబో రానున్న ‘హనుమాన్‌’ సినిమా షూటింగ్‌ నేటితో పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ [వీడియో ](url)విడుదల చేశారు. చిన్న ప్రాజెక్టుగా మెుదలైన ఈ సినిమా.. టీజర్ రిలీజ్ తర్వాత పాన్‌ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సంపాందించుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో మే 12న రిలీజ్ కానుంది. కాగా, హనుమాన్‌లో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మీ, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యపాత్రలు పోషించారు. అనుదీప్‌ దేవ్‌, హరిగౌర, … Read more

    ‘తంగలాన్’: చియాన్ మార్క్ భీభత్సం

    చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నేడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీలో విక్రమ్ అర్ధనగ్నంగా వయసు మళ్లిన పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ కం హిస్టారిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని యూవీ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Courtesy Twitter: Eluru … Read more

    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!

    విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్‌. ఆయన ఎవరో కాదు చియాన్‌ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.  శివ పుత్రుడు పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. … Read more

    #OG: FireStorm మొదలైంది…!

    పవన్‌ కల్యాణ్-సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్ గ్యాంగ్‌స్టర్‌ మూవీ OG షూటింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్‌ సుజిత్‌… క్లైమాక్స్‌ సీన్‌ను రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ నుంచి వస్తున్న సినిమాల్లో దీనిపైనే అభిమానులకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

    థియేటర్‌లో వావ్‌ అనిపించిన దసరా ర్యాప్‌ విన్నారా?

    రూ. 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘దసరా’ సినిమాలో నాని క్రికెట్‌ ఆడుతున్నపుడు ఓ ర్యాప్ వస్తుంది. పక్కా మాస్‌ సీన్‌కు ఈ ర్యాప్ అగ్నికి ఆజ్యంలా తోడయిందనే చెప్పాలి. సంతోశ్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందించిన ఈ పాటకు తెలుగు లిరిక్స్ కాసర్ల శ్యామ్‌ రాయగా, ఇంగ్లిష్ లిరిక్స్ షాన్ విన్సెంట్ డి పాల్‌ రాశాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై వావ్‌ అనిపించిన ఈ సాంగ్‌ను మీరూ చూడండి.