• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    వేసవి కాలం వచ్చేసింది. కొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవలు వస్తాయి. పిల్లలు, పెద్దలు దొరికిన కాస్త సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఒకసారి అవెంటో తెలుసుకోండి.

    విరూపాక్ష

    సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విభిన్నమైన కథతో కార్తీక్ దండు తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

    హలో.. మీరా.. !

    గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానపాత్రలో నటించిన హలో… మీరా ! చిత్రం కూడా ఈ నెల 21న శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగుతుంది. కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌ కథతో రూపొందింది. తెరపై కనిపించే.. తెర వెనుక వినిపించే పాత్రలకు సినిమాపై ఆసక్తిని పెంచాయి. 

    ఓటీటీ చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు

    Title CategoryLanguagePlatformRelease Date
    How to get rich Series EnglishNetflixApril 18
    Chimp empire Documentary English Nerflix April 19
    The marked heart Series EnglishNetflixApril 19
    Chota bheemSeries HindiNetflixApril 20
    Tooth pariMovieHindiNetflix April 20
    Diplomat MovieEnglishNetflixApril 20
    Satya 2MovieTelugu NetflixApril 21
    Ready MovieTelugu NetflixApril 21
    Indian hatch making SeriesHindi NetflixApril 21
    A tourist guide to loveMovieEnglish NetflixApril 21
    Garmi SeriesHindi Sony livApril 21
    Suga Documentary specialHindi hotstarApril 21
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv