Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?

    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?

    September 10, 2024

    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. 

    తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌!

    యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 

    డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు

    డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’, సాయిపల్లవితో చేసిన ‘హేయ్‌ పిల్లగాడ’, ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు. 

    కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు

    తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ ‘కాంత’ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. 

    ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ!

    టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version