ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 5) ఈ మూవీ రిలీజ్ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్ చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు!
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్, డిజిటల్ పేజ్ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.
విజయ్, మృణాల్ కూడా ఇంతే!
ఫ్యామిలీ స్టార్ సినిమాలోని ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సాంగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. హుక్ స్టెప్పులతో ఆడియన్స్ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఇదే
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.
‘హిట్ కొట్టేసారండీ’
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని ‘హిట్ కొట్టేసారండీ’ అని కంప్లీమెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్ ఇట్ అంటూ దేవరకొండను హగ్ చేసుకుందట. మరోవైపు విజయ్ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!