• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?

  యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా.. విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ‘గామి’ (Gaami) చిత్రం.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విష్వక్‌ తొలిసారి అఘోరా పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా  ‘గామి’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్వక్‌కు ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌ను మరోస్థాయికి ‘గామి’ తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘గామి’ ట్రైలర్‌ చూసిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

  ప్రభాస్‌ ఏమన్నాడంటే!

  విజువల్‌ వండర్‌గా విడుదలైన ‘గామి’ (Gaami) ట్రైలర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. హీరో ప్రభాస్‌ ‘గామి’ ట్రైలర్‌పై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో బైట్‌నే రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటాడని ప్రశంసించాడు. ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా ఉందని.. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రతీ ఒక్కరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తోందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. 

  ‘గామి’ అరుదైన చిత్రం’

  ‘గామి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశాడు. అనంతరం సందీప్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు. 

  ‘గామి’ అంటే అర్థం ఇదే!

  ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ‘గామి’ టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికి అర్థం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థంపర్థం లేని టైటిల్‌గా అనిపిస్తోందంటూ కొందరు విమర్శలు సైతం చేశారు. అయితే దీనిపై ట్రైలర్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత క్లారిటి ఇచ్చారు. ‘గామి అంటే గమ్యాన్ని గమించేవాడు’ అని మీనింగ్ వస్తుందని తెలిపాడు. చిన్నగా మెుదలైన ‘గామి’.. విష్వక్‌, నిర్మాత ప్రోత్సాహంతో పెద్ద చిత్రంగా మారిందని అన్నారు. విజువల్‌ వండర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 

  ‘ఫీచర్ ఫిల్మ్ అంటే నమ్మలేదు’

  డెఫ్‌ & డంబ్‌ నటి అభినయ (Actress Abhinaya) ‘గామి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దేవదాసి పాత్రలో ఆమె కనిపించనుంది. మాటలు రాకపోయినా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అభినయ సైగలతో చేసిన స్పీచ్‌ ఆసక్తి రేపుతోంది. ‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తొలుత నమ్మలేదు. వైజాగ్‌ షూటింగ్‌లో ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్‌ పూర్తి చేసేశారు డైరెక్టర్‌’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv