‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ రామ్‌చరణ్ పట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం ఈ విజువల్ ట్రీట్‌ను చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఫస్ట్ సాంగ్ వచ్చేసింది?
‘గేమ్ ఛేంజర్’ మెుదటి సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ‘జరగండి’ (Jaragandi) లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘జరగండి జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెటేసుకొచ్చేనండి’ అనే లిరిక్స్‌తో ఈ పాట మొదలైంది. మాస్ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్‌తో జరగండి పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఆనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. ప్రభుదేవ కొరియాగ్రఫీ చేశారు.
పాట ఎలా ఉందంటే?
‘జరగండి’ సాంగ్ లిరికల్ వీడియోను గమనిస్తే ఇది పక్కా డైరెక్టర్ శంకర్ మార్క్‌తో రూపొందింది. ఆయన గత చిత్రాల్లోని పాటలు ఎలా అయితే ప్రత్యేకంగా అనిపించాయో ఈ సాంగ్ కూడా అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సాంగ్ అంతా కలర్‌ఫుల్‌గా.. పదుల సంఖ్యలో డ్యాన్సర్లతో నిండిపోయింది. ఇందులో రామ్‌చరణ్, కియారా అద్వానీ పెయిర్ చాలా క్యూట్‌గా ఉంది. ఇద్దరూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. చరణ్ తన డ్యాన్స్‌తో ఇరగదీసినట్లే కనిపిస్తోంది. ప్రభుదేవ మాస్టర్ ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్ చేస్తున్న దృశ్యాలను సైతం ఈ లిరికల్ వీడియోలో గమనించవచ్చు. ఓవరాల్‌గా ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది.
ఆ విషయంలో ఫ్యాన్స్ నిరాశ!
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. అయితే అలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనీసం కమింగ్ సూన్ (Coming Soon) అని కూడా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం