యంగ్ డైరెక్టర్ సుజీత్ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్ రజా రన్’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్ ‘సాహో’ (Saaho)తో పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్
సుజీత్ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్ 26న జన్మించాడు. తొలుత చార్టెట్ అకౌంటెండ్ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్ ఫిల్మ్ & టీవీ అకాడమీలో ఫిల్మ్ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్ తెరకెక్కించాడు.
షార్ట్ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ
సాధారణంగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ సుజీత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘తొక్కలో లవ్ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్ డ్రామా’, ‘ఇండియన్ ఐడల్’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్ చేశాడు.
తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట
తను డైరెక్టర్ అవుతానని సుజీత్ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.
పూరి జగన్నాథ్ సూచనతో
డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.
23 ఏళ్లకే డైరెక్టర్‌గా..
డైరెక్టర్ ఛాన్స్ కోసం సుజీత్ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్‌నే సినిమా తీసి..
తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్‌నే తన ఫస్ట్ ఫిల్మ్‌గా సుజీత్ తెరకెక్కించడం విశేషం. షార్ట్ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
బాహుబలి కంటే ముందే
తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్ ప్లాన్ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్ కాలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఫ్యాన్ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్ సింగ్ రిలీజ్ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి సుజీత్ ఎదగడం సాధారణ విషయం కాదు.
జపనీస్ సినిమాలంటే చాల ఇష్టం
డైరెక్టర్ సుజీత్‌కు జపనీస్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.
ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్
సుజీత్ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
క్రికెట్ అంటే పిచ్చి
సుజీత్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
భక్తి ఎక్కువే
సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు.
ప్రేయసితో వివాహం
దర్శకుడు సుజీత్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.
ఉత్తమ డైరెక్టర్‌గా
తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు.
బర్త్‌డే స్పెషల్ వీడియో
నేడు దర్శకుడు సుజీత్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.