• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Helmet Offers: అమెజాన్‌ పండగ సేల్‌.. బ్రాండెడ్‌ హెల్మెట్లపై భారీ డిస్కౌంట్స్‌!

    వరుస పండగల నేపథ్యంలో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల వస్తువులపై అమెజాన్‌ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి గృహోపకరణ వస్తువుల దాకా ప్రతీ దానిపై రాయితీలను ఇస్తోంది. ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌తో పాటు హెల్మెట్‌లను కూడా తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. టాప్‌ బ్రాండెడ్‌ కంపెనీల హెల్మెట్లను తక్కువ ధరకే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్తగా హెల్మెట్‌ కొనాలని భావిస్తున్న వారు వెంటనే అమెజాన్‌లో హెల్మెట్‌ను బుక్‌ చేసుకోండి. ప్రస్తుతం హెల్మెట్‌లపై ఉన్న టాప్‌ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం.

    Vega Crux Helmet

    ఈ హెల్మెట్‌ మెటాలిక్‌ క్విక్‌ రిలీజ్‌ సైలెంట్‌ బకిల్‌ను కలిగి ఉంది. చిన్‌ గార్డ్‌ను అటు ఇటు తిప్పడానికి అనుకూలంగా ఉంటుంది. సింగిల్‌ లివిల్‌ ఫ్లిప్‌ అప్‌ మెకానిజంతో ఆపరేట్ చేయవచ్చు. హెల్మెట్‌ షెల్‌ను మన్నికైన ABS మెటీరియల్‌తో తయారు చేశారు. అమెజాన్‌లో ఈ హెల్మెట్‌ రూ.1,152 లభిస్తోంది. 

    Studds Marshall Open Face Helmet

    పాలియురేతెన్‌, థర్మోప్లాస్టిక్ పదార్థాలతో ఈ హెల్మెట్‌ను రూపొందించారు. షెల్‌ అదనపు రక్షణ కోసం EPS/థర్మోప్లాస్టిక్‌ను ఉపయోగించారు. దీనిని పురుషులు, మహిళలు, యువత ఎవరైనా వినియోగించవచ్చు. ఈ హెల్మెంట్‌పై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. ఈ హెల్మెట్‌ మీ ప్రాధాన్యతను బట్టి రౌండ్ ఓవల్ లేదా ఇంటర్మీడియట్‌ ఓవల్ ఆకారంలోకి హెల్మెట్‌ను మార్చుకోవచ్చు. 

    Steelbird SB-50 Adonis

    ఈ హెల్మెట్‌ను డైనమిక్‌ వెంటిలేషన్‌ సిస్టమ్‌తో రూపొందించారు. దీని వల్ల సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా బండిని డ్రైవ్‌ చేయవచ్చు. లోపలి షెల్‌ను అధిక సాంద్రత కలిగిన పాలీస్టైరీన్‌, కాటన్ ఫాబ్రిక్‌ ఇంటీరియర్‌తో తయారు చేశారు. ఈ హెల్మెట్‌ నియంత్రిత సాంద్రత కలిగిన EPS కంకషన్‌ ప్యాడింగ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా యాంటీ అలెర్జిక్‌ వెల్వెటిన్‌తో కప్పబడి ఉంది. అమెజాన్‌లో ఇది రూ.847లకు సేల్‌ అవుతోంది. 

    Royal Enfield Open Face 

    ఈ హెల్మెట్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.2,100. కానీ అమెజాన్‌ దీనిని 21% డిస్కౌంట్‌తో రూ.1,657 సేల్‌ చేస్తోంది. ఈ హెల్మెట్‌ పాలీ-కార్బోనేట్‌ మెటీరియల్‌తో తయారైంది. 

    Yamaha YR4 Full Face Helmet 

    ఈ హెల్మెట్‌ పాలీకార్బోనెట్‌ యాంటి స్క్రాచ్‌ కోటెడ్‌తో తయారైంది. ముందు వైపు రియర్ వెంటిలేషన్‌ కూడా ఉంది. రౌండ్‌ ఓవెల్‌, ఇంటర్‌మీడియట్‌ ఓవల్‌ షేప్‌లలోకి హెల్మెట్‌ను మార్చుకోవచ్చు. అమెజాన్‌లో ఈ హెల్మెట్‌ రూ.924లకు అందుబాటులో ఉంది. 

    CarBinic Knight Half Face Helmet 

    ఈ హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్‌ను స్త్రీలు, పురుషులు ఎవరైనా వినియోగించవచ్చు. ఇది స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ హెల్మెట్‌ రూపొందింది. అమెజాన్‌లో ఈ హెల్మెట్‌ రూ.1,359లకు సేల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv