• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Honda SP 125 Sport: రూ.90 వేలకే హోండా స్పోర్ట్స్‌ ఎడిషన్‌ బైక్‌.. టాప్‌ లేపుతున్న ఫీచర్లు..!

  పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ సరికొత్త బైక్​లను లాంఛ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హోండా మోటార్​ సైకిల్ అండ్ స్కూటర్​ ఇండియా.. సరికొత్త బైక్‌ను భారత్‌లో రిలీజ్‌ చేసింది. హోండా ఎస్​పీ 125 స్పోర్ట్స్ (Honda SP125 Sport)​ పేరుతో నయా బైక్‌ను పరిచయం చేసింది. ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ‘Honda SP125’ బైక్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొచ్చింది. దీంతో ద్విచక్ర వాహన ప్రియుల దృష్టి దీనిపై పడింది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌ ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  బైక్‌ ఇంజిన్‌

  హోండా SP125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాత తరం మోడళ్లలో వినియోగించిన 123.94cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ అమర్చారు. ఇది 10.72bhp పవర్‌ను, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను తాజా BS-VI OBD-2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. 

  స్టైలిష్‌ డిజైన్‌

  ఈ బైక్‌ అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే ఇందులో బ్రైట్  LED హెడ్‌ల్యాంప్, గేర్ పొజిషన్ ఇండికేటర్, మైలేజ్ సమాచారంతో కూడిన ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. 

  ఐదు గేర్లు

  ఈ బైక్‌ ఐదు గేర్లతో పని చేయనుంది. కంఫర్ట్ రైడింగ్ కోసం ప్రీ లోడెడ్ అడ్జస్టబుల్ రేర్ షాక్ అబ్జార్బర్, స్టార్ట్-స్టాప్ స్విచ్, పాసింగ్ స్విచ్ కూడా ఈ బైక్‌లో ఉంది. స్టెబిలిటీ అండ్ గ్రిప్ లెవల్ మెరుగుదల కోసం 100 ఎంఎం వెడల్పు గల రేర్ టైర్స్‌ను దీనికి ఫిక్స్‌ చేశారు. 

  మైలేజ్‌

  ఈ బైక్‌ మంచి మైలేజ్‌ అందిస్తుందని హోండా కంపెనీ చెబుతోంది. లీటర్‌కు 65 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని బైక్‌ లాంచ్‌ సందర్భంగా తెలిపింది. 

  బైక్‌ కలర్

  హోండా SPR125 స్పోర్ట్ ఎడిషన్‌ బైక్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపికచేసుకోవచ్చు. 

  ధర ఎంతంటే?

  హోండా ఎస్​పీ 125 స్పోర్ట్స్​ ఎడిషన్​ బైక్​ ధర రూ.90,567 (ఎక్స్​ షోరూం)గా ఉంది. దేశంలోని అన్ని హోండా షోరూమ్‌లలో ఈ బైక్​ లభిస్తుంది. అయితే ఇది లిమిటెడ్​ (పండుగ సీజన్​) సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv