చైనాకు చెందిన టెక్ దిగ్గజం హానర్ (Honor) సరికొత్త ట్యాబ్లెట్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘హానర్ ప్యాడ్ 9’ (Honor Pad 9) పేరుతో ఈ ట్యాబ్ అతి త్వరలోనే భారత్‌లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత నెల బార్సిలోనాలో జరిగిన మెుబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్‌లో హానర్.. ఈ ట్యాబ్‌ను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్యాడ్ ఇప్పటికే చైనాలో అందుబాటులోకి రాగా అక్కడ దీనికి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘Honor Pad 9’ను భారత్‌లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హెచ్‌టెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సీపీ ఖండేవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ట్యాబ్ ధర, ఫీచర్లు తదితర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ట్యాబ్ స్క్రీన్
‘Honor Pad 9’ ట్యాబ్లెట్.. 12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 2,560 x 1,600 pixels రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 500 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ట్యాబ్ MagicOS 7.2 ఆపరేటింగ్ సిస్టమ్, ప్రొసెసర్‌పై పని చేయనుంది. అలాగే ఇందులో అడ్రెనో 710 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఫీచర్ కూడా ఉంది.
ర్యామ్ & స్టోరేజ్
హానర్ ప్యాడ్ 9 ట్యాబ్లెట్.. 12GB RAM & 512GB స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఈ టాబ్లెట్ మెమరీ విస్తరణకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే microSD కార్డును ఉపయోగించి 1TB వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
బిగ్ బ్యాటరీ
హానర్ ప్యాడ్ 9 మోడల్.. 8300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. ఈ బ్యాటరీ ఈ బ్యాటరీ 8 గంటల నిరంతర వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ లాంచింగ్ రోజున ప్రకటించింది.
కెమెరా
ఈ Honor Pad 9 ట్యాబ్లెట్.. 13MP కెమెరాను వెనుక వైపు కలిగి ఉంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దానితో పాటు పోర్ట్రెయిట్, HDR వంటి మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ అద్భుతమైన టాబ్లెట్‌లో సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 8MP కెమెరా కూడా ఫిక్స్ చేశారు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ నయా హానర్ ట్యాబ్.. Wi-Fi 802, బ్లూటూత్ 5.1, USB టైప్ C, OTG వంటి వివిధ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఈ టాబ్లెట్‌లో డ్యూయల్ మైక్రోఫోన్ సదుపాయం ఉంది. ఇందులో 8 స్పీకర్లను కంపెనీ అమర్చిచింది. సౌండ్ లౌడ్‌గా ఉండటంతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని హానర్ వర్గాలు తెలిపాయి. ఈ ట్యాబ్ 6.96mm థిక్‌నెస్, 555 గ్రాముల బరువును కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్
హానర్ ప్యాడ్ 9 ట్యాబ్.. మెుత్తం మూడు రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశముంది. అజూర్, వైట్, గ్రే రంగుల్లో ఈ ట్యాబ్ భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది.
ధర ఎంతంటే?
భారత్‌లో Honor Pad 9 ధరపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. లాంచింగ్ రోజునే ధర, ఫీచర్లపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ట్యాబ్ ధర రూ.20,000 లోపే ఉండవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.