దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమెుబైల్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai)కి భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆ సంస్థ రిలీజ్ చేసే కార్లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యుందాయ్ తన సరికొత్త ‘Hyundai i20’ కారును త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ చేయబోతోంది. ఈ కారు మర్చిపోలేని ఇంప్రెషన్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిని స్పోర్టీ, డైనమిక్ లుక్‌లో తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఫలితంగా లోపల, బయట లగ్జరీ ఫీలింగ్ ఉంటుందని హ్యుందాయ్ అంటోంది. మరి ఇందులో వాస్తవమెంతా? ఈ కారు ఎలాంటి ఫీచర్లు కలిగి ఉంది? ఈ కథనంలో చూద్దాం.
డ్యాష్‌క్యామ్ ఆప్షన్
Hyundai i20 హ్యాచ్‌బ్యాక్ మోడల్లో ఫ్రెంట్ ఫేస్‌లో గ్రిల్, LED హెడ్‌లైట్ యూనిట్స్ ఉండనున్నాయి. ఈ కారు డ్యాష్‌కామ్ ఆప్షన్‌లో అందుబాటులోకి రావొచ్చు. ఇదే నిజమైతే.. హ్యాచ్‌బ్యాక్ మోడల్లో డ్యాష్‌క్యామ్ ఆప్షన్ లభిస్తున్న తొలి కారుగా ఐ20 నిలుస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్లో వాడిన డ్యాష్‌క్యామ్ ఇందులోనూ ఉంటుందని సమాచారం.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
హ్యుందాయ్ ఐ20… ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రెంట్ పార్కింగ్ సెన్సార్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, వయర్లెస్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్ వంటివి ఈ కారులో ఉండనున్నాయి.
ఇంజన్ సామర్థ్యం
ఐ20 కొత్త కారు.. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ మోటర్‌తో వస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 82 బీహెచ్పీ పవర్‌ను, 114.7 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక మరో ఇంజిన్.. 118 హెచ్‌పీ పవర్‌ను, 172 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, సీవీటీ, డీసీటీ టాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తోంది.
కనెక్టివిటీ ఫీచర్లు
Hyundai i20లో ఆక్సీబూస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్, ఓవర్ ది ఎయిర్ మ్యాప్, నేవిగేషన్ సిస్టం, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కార్‌ప్లే, ఆటో ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ కారులో గ్లోవ్ బాక్స్ కూలింగ్ సెటప్ ఉంది. ఈ బాక్స్ లోపల అంతా కూల్‌గా ఉండేలా చేస్తుంది.
భద్రతకు పెద్ద పీట
సేఫ్టీ పరంగా చూస్తే ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉంది. ఇంకా వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఉన్నాయి. Hyundai i20 కారు 7 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఫియరీ రెడ్, ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్, టైపూన్ సిల్వర్, స్టార్రీ నైట్, టైటన్ గ్రే, ఫియరీ రెడ్ టర్బో రంగుల్లో అందుబాటులోకి రానుంది.
ధర ఎంతంటే?
Hyundai i20 టెస్ట్ డ్రైవ్ కోసం రిక్వె్స్ట్ పెట్టుకోవచ్చని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఐతే, దీని ధర ఎంత, ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవుతుంది అనేది ఇంకా చెప్పలేదు. కానీ, ఈ కారు రూ.12 లక్షలకు పైగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్