బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్ పరంగా కల్కి సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్ పరంగా టాప్-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
యూఎస్‌లో రికార్డు వసూళ్లు
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్ టాక్ వస్తే ఈజీ గానే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్ టాక్ వచ్చినా ఓవర్సీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Top 10 Highest Opening Day Collections in India
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. సలార్ (2023)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్ తెగ మెచ్చుకున్నారు.
4. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
5. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
6. జవాన్ (2023)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది.
7. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
8. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
9. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
10. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.