రివ్యూస్
How was the movie?
తారాగణం
రజనీకాంత్
చిట్టి
కుట్టి
అక్షయ్ కుమార్
అమీ జాక్సన్
సుధాంశు పాండే
ఆదిల్ హుస్సేన్
ఈశారి వేలన్ గణేష్
కళాభవన్ షాజోన్
కైజాద్ కొత్వాల్
అనంత్ మహదేవన్
మయిల్సామి
మైఖేల్ ముత్తు
ప్రియా ప్రిన్స్
మయూర్ బన్సీవాల్
సంచనా నటరాజన్
మాయ ఎస్ కృష్ణన్
అవిజిత్ దత్
ఆదిత్య శివపింక్
అనిత సంపత్
సవితా రాధాకృష్ణన్
సిబ్బంది
ఎస్. శంకర్
దర్శకుడుఎస్. శంకర్
నిర్మాతAR రెహమాన్
సంగీతకారుడునీరవ్ షా
సినిమాటోగ్రాఫర్కథనాలు
Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్ ఎంతంటే?
కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్‌కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్‌కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.
ఇకపై మరింత పతనం!
తొలి వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి.
ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
జూలై 15 , 2024
Bharateeyudu 2 Day 1 Collections: ‘భారతీయుడు 2’కి ఊహించని షాక్.. భారీగా పడిపోయిన కలెక్షన్స్!
కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వచ్చిన 'భారతీయుడు' చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్రం శుక్రవారం (జులై 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందులేక తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. 'భారతీయుడు 2' తమను తీవ్రంగా నిరాశ పరిచిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడు తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మిశ్రమ స్పందన ఈ సినిమా వసూళ్లపై చూపిన ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని విశ్లేషించాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై పెద్దగా ఆసక్తి కనబరచలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కలెక్షన్స్‌లో భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
https://telugu.yousay.tv/bharateeyudu-2-review-bharateeyudu-2-is-a-major-disappointment-in-those-aspects-how-is-the-movie.html
జూలై 13 , 2024
Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. గురువారం (జూన్ 27) వరల్డ్ వైడ్‌గా విడుదలై అదరగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కల్కి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి.. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై పడింది. మైథాలజీ - ఫ్యూచరిక్ జానర్‌లో విజువల్ వండర్‌గా రూపొందిన కల్కి ఫిల్మ్.. మెుదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. మరి కల్కి ఆ మార్క్‌ను అందుకుందా? బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మేనియా ఏ స్థాయిలో పని చేసింది? అటు యూఎస్‌లో కల్కి సృష్టించిన ఆల్‌టైమ్ రికార్డ్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆల్‌టైమ్ రికార్డు
ప్రభాస్ ‘కల్కి’ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్’ (3.46 మిలియన్లు), ‘సలార్’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి.
ఓవర్సీస్‌లో ఎంతంటే?
ప్రీమియర్స్, ఫస్ట్‌డే కలెక్షన్స్ కలిపి అమెరికాలో తొలి రోజు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను కల్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్‌లో కల్కి బెంచ్‌మార్క్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డ్ సేఫ్!
ట్రేడ్ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డ్ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్ చేసి టాప్-3లో నిలిచింది.
కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్!
'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. అయితే సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్‌లో కల్కి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది.
Top 10 Highest Opening Day Collections in India
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. సలార్ (2023)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్ తెగ మెచ్చుకున్నారు.
4. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
5. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
6. జవాన్ (2023)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది.
7. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
8. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
9. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
10. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.
జూన్ 28 , 2024
Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్ చరిత్ర సృష్టించడం ఖాయం..!
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్ పరంగా కల్కి సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్ పరంగా టాప్-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
యూఎస్‌లో రికార్డు వసూళ్లు
'కల్కి 2898 ఏడీ' చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్ టాక్ వస్తే ఈజీ గానే 'ఆర్‌ఆర్‌ఆర్', ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్ టాక్ వచ్చినా ఓవర్సీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Top 10 Highest Opening Day Collections in India
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. సలార్ (2023)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్ తెగ మెచ్చుకున్నారు.
4. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
5. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
6. జవాన్ (2023)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది.
7. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
8. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
9. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
10. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.
జూన్ 26 , 2024
Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్?
ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.
బాహుబలి 2
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించింది.
కేజీఎఫ్ 2
కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.
సాహో
బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రోబో 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
జూన్ 16 , 2023
These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రోబో 2.0 - పక్షి రాజు
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.
https://www.youtube.com/watch?v=5OkypaWGYAo
నేను లోకల్ - నవీన్ చంద్ర
హీరో నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను లోకల్’ (Nenu Local) చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్ తండ్రి నవీన్ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
https://www.youtube.com/watch?v=rYcZLAgPLps
‘వి’ - నాని
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf
నిన్నుకోరి - నాని
ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.
https://www.youtube.com/watch?v=ie8feBbd4VA
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్
వెంకటేష్-మహేశ్ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది.
https://www.youtube.com/watch?v=G50OUBEZm-4
మగధీర - శ్రీహరి
మగధీరలో రామ్‌చరణ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.
https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec
పుష్ప - శత్రు
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.
https://www.youtube.com/watch?v=krENzIi3Tto
పరుగు - ప్రకాష్ రాజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, షీలా కౌర్ జంటగా చేశారు. ప్రకాష్ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్ రాజ్.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU
విక్రమ్ - కమల్ హాసన్
ఇందులో హీరో కమల్ హాసన్ మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం (విజయ్ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు.
https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2
రిపబ్లిక్ - రమ్యకృష్ణ
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.
https://www.youtube.com/watch?v=FWg79VONoTY
ఫిబ్రవరి 27 , 2024
Fastest 500Cr Movies: జెట్ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
ఒకప్పుడు దేశంలో సూపర్ హిట్ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి-2
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.
2. ఆర్‌ఆర్‌ఆర్
బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే.
3. కేజీఎఫ్ 2
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
4. పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.
5. రోబో 2.0
రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.
6. సుల్తాన్
సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ చిత్రం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
7. దంగల్
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.
8. పీకే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.
9. టైగర్ జిందా హై
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.
10. సంజు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.
సెప్టెంబర్ 05 , 2023
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? వినాయక చవితికి బిగ్ సర్‌ప్రైజ్!
'ఆర్ఆర్‌ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. వినాయక చవితి రోజున చరణ్ సినిమాకు సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రిలీజ్ డేట్ లాక్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
టీజర్‌కు రంగం సిద్ధం
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో కంటెంట్ రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలని గేమ్ ఛేంజర్ టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఒకే నెలలో రెండు అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో ఈ టీజర్ విడుదల కావొచ్చని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
క్రిస్మస్‌కే ఎందుకు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నాసామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
సెప్టెంబర్ 04 , 2024
Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్.. ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది రానట్లేనా?
'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్ కోసం దర్శకుడు శంకర్ వెతుకుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ కంప్లీట్ చేసేసరికి డిసెంబర్ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే మూవీ యూనిట్ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది చరణ్ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
2024 సమ్మర్ కానుకగా!
రామ్ చరణ్ - శంకర్ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' చిత్రం డిసెంబర్ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్ బరిలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్ ఛేంజర్’ను బరిలోకి దింపడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కియారా పోస్టర్ అదుర్స్!
గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్, కియారాలతో పాటు ఎస్.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆగస్టు 06 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024
Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్ చిత్రాలు ఇవే!
గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్ పార్ట్ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మనీ మనీ మోర్ మనీ
జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
Money Money More Money Wallpapers
శంకర్‌దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
కిక్ 2
రవితేజ కెరీర్‌లోని టాప్-5 హిట్ చిత్రాల్లో ‘కిక్’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
సర్దార్ గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
మన్మథుడు 2
అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.
గాయం 2
1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రానికి ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించారు.
ఆర్య-2
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్ మాత్రమే తెచ్చుకుంది.
చంద్రముఖి 2 & నాగవల్లి
తెలుగులో వచ్చిన టాప్-5 హారర్ చిత్రాల్లో రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్ లీడ్ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ చేశాడు.
రోబో 2
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు.
సత్య 2
రామ్‌గోపాల్ వర్మను బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
వెన్నెల 1/2
రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించడం విశేషం.
అవును 2
విభిన్నమైన హారర్ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
మంత్ర 2
కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.
ఫిబ్రవరి 22 , 2024
Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్’ ఆల్‌టైమ్ రికార్డ్.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్!
షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్ బాక్సాఫీస్ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్ కలెక్షన్స్. ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా జవాన్ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్ 7) రిలీజైన జవాన్ చిత్రం.. హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా షారుక్ ఖాన్ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్ లెక్కల విషయానికి వస్తే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్ గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన టాప్-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం.
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
4. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
5. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
6. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
7. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
8. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.
9. కబాలి (2016)
2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్ సాధించింది. జైలర్ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్ డే హైయస్ట్ గ్రాసింగ్ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది.
10. పొన్నియన్ సెల్వన్ (2022)
మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 08 , 2023
Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్ చేసుకొని హిట్స్ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
దసరా (Dasara)
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ 'దసరా'. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://youtu.be/IUCbmWfVd8g?si=CPovFG1Ig_7cdS9b
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
రామ్‌చరణ్, తారక్ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్ సైన్యాన్ని ఏరిపారేస్తాడు.
https://youtu.be/8HTrv_MAuSE?si=CMqWkW8LRa3GqLA9
బాహుబలి 2
‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.
https://youtu.be/4s6k7UpFnKc?si=7G-OJDfUuey9hKVV
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మాస్ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్ మీద వేసి చిరు హతమారుస్తాడు.
https://youtu.be/v0_E2uqVeaM?si=8z1LFqnzEJ3Wzy4x
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్ విలన్ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్ ఫైర్ అయ్యి విలన్ చనిపోయే సీన్స్ క్లాప్స్ కొట్టిస్తుంది.
https://youtu.be/1SCFGWtXtDE?si=r1AnoKHjBFFyrNXu
పోకిరి (Pokiri)
తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్ & కోపై క్లైమాక్స్‌లో రివేంజ్ తీర్చుకునే సీన్ నెవర్ బీఫోర్ అన్నట్లుగా ఉంటుంది.
https://youtu.be/PvkITH66FEc?si=2CJl4283NO85bYmd
తమ్ముడు (Thammudu)
స్పోర్ట్స్ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్ జగన్నాథ్ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్ కోర్టులో నిలిచిన పవన్ కల్యాణ్.. తొలుత విలన్ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు.
https://youtu.be/CZY-tl5JbSo?si=Ui97I0J_rOAi5s5j
ఖుషి (kushi)
పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్ ప్లాన్ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు.
https://youtu.be/R9VXMjfP6Kc?si=nt00kn-z4dqexdCZ
విరుపాక్ష (Virupaksha)
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్ తెలియడంతో ఆడియన్స్ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.
https://youtu.be/C1vmB8G2oTw?si=hcLk1a9tPl1WC6xQ
సై (Sye)
నితిన్ - జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్ అయిన నితిన్ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
https://youtu.be/oc4J_qQcNkw?si=rSuIQ2jUftA4c4Mx
రోబో 2.0 (Robo 2.0)
డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో విలన్ పక్షిరాజా (అక్షయ్ కుమార్)తో రోబో (రజనీకాంత్) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు.
https://youtu.be/I04BTA2fl-E?si=9hCEwzbPcG-m81VM
అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo)
అల్లుఅర్జున్ బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు.
https://youtu.be/ljHApHUTWeo?si=90dOM8aTCAWsSHoU
అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం.
https://youtu.be/HsV7k8m0QU0?si=42tjl5fOTTS4xEz6
సుస్వాగతం (Suswagatham)
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ క్లైమాక్స్ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్ చెప్పే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్ పేర్కొంటాడు.
https://youtu.be/323OoE0Figo?si=pm-8iXzG8DleERw1
మార్చి 12 , 2024
Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
సూపర్ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్ ‘కామిక్ కాన్’ (Comic Con). అవెంజెర్స్, స్పైడర్‌మ్యాన్, అవతార్, సూపర్ మ్యాన్ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్ కాన్ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హనుమాన్ (Hanuman)
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్ సూపర్ మ్యాన్ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్ హెయిర్ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు.
భీమ్ (ఆర్ఆర్‌ఆర్)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్’ చిత్రంలో తారక్ (Jr NTR) భీమ్ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాడే సీన్ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్ వేస్తే మీరూ భీమ్ లాగా కనిపించవచ్చు.
బాహుబలి (Bahubali)
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో అంతం చేస్తాడు. అటువంటి బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.
భల్లాల దేవ (Bhallala Deva)
‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.
కట్టప్ప (Kattappa)
‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.
కాలకేయ (Kalakeya)
కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్ రోల్ హైలెట్ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు.
అపరిచితుడు (Aparichithudu)
ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో విక్రమ్ చేసే ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్ డ్రెస్ ధరించి లాంగ్ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.
రోబో (Robo)
భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో రజనీకాంత్ సూపర్ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.
పక్షిరాజా (Pakshi Raja)
‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.
అరుంధతి (Arundhati)
తెలుగులో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.
పశుపతి (Pasupathi)
తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.
ఆదిత్య 369 (Aditya 369)
బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్ మిషన్ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్ జాకెట్‌ను వేయండి.
సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్ చిరంజీవిలాగా లాంగ్ హెయిర్, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.
బింబిసార (Bimbisara)
5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్ హెయిర్ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్ రామ్ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)
బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.
ఫిబ్రవరి 29 , 2024
Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు.
గ్లింప్స్ చెప్పే సీక్రెట్స్ ఇవే!
కాగా, ప్రాజెక్ట్ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు.
https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20
అమితాబ్ పాత్ర నిడివి తక్కువేనా?
ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్ బచ్చన్) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.
https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20
ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా?
ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్‌తో పాటు హీరోయిన్ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
చీకటికి రారాజు అతడే?
ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోతో అది కన్‌ఫార్మ్ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్Kలో కమల్ హాసన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్ హాసన్ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.
https://twitter.com/i/status/1672854637014138880
సూపర్ రెస్పాన్స్
గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
https://twitter.com/THR/status/1682126315229683715?s=20
విడుదల తేదీ?
ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి.
https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
జూలై 21 , 2023
Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్ చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
7:11PM
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం సాధించింది.
ఒకే ఒక జీవితం
తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
Disco Raja
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.
Mark Antony
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు.
Krrish 3
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది.
Robo 2.o
సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు.
Robo
రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది.
24
టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు.
Skylab
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.
Srivalli
బ్రేయిన్ మ్యాపింగ్ అనే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.
Taxiwaala
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.
Tik Tik Tik
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు.
Chandamama Lo Amrutham
చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
Yuganiki Okkadu
తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు.
ఆదిత్య 369
తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.
Kalki 2898 AD
సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
నవంబర్ 07 , 2023
Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ.
ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ
మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy)
అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్ ఘోష్).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.
బూమర్ అంకుల్ (Boomer Uncle)
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్'. ఇందులో ఓవియా, రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'నేసమ్ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.
హాట్‌స్పాట్ (Hotspot)
గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
నాగేంద్రన్స్ హనీమూన్ (Nagendran's Honeymoons)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
బహిష్కరణ (Bahishkarana)
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.
https://twitter.com/i/status/1802226071795896339
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్ అకెంటెంట్ త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
జూలై 18 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి.
[toc]
Drushyam
దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్) ఊరిలో కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.
Karthikeya 2
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే…
కార్తికేయ (నిఖిల్)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
Bichagadu 2
ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ
F2
2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్(వరుణ్ తేజ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ.
Ante Sundaraniki
గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
Tholiprema
ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే..
అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
Pelli Choopulu
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
ఓటీటీ సన్ నెక్ట్స్
Spyder
స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే…
ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్
Raja The Great
రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా
Ori Devuda
వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా
Bichagadu
ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో
Jalsa
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
ఓటీటీ: ఆహా
Nenu
అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
Sye Raa Narasimha Reddy
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే..
భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
Bharat Ane Nenu
సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా
Ye Maaya Chesave
ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Baahubali: The Beginning
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
Businessman
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్
Good Luck Sakhi
బంజార యువతి సఖి (కీర్తి సురేష్) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Oxygen
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
Adipurush
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
SR Kalyanamandapam
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ: ఆహా
Disco Raja
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
ఓటీటీ: సన్ నెక్స్ట్
Goutham Nanda
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
Kirrak Party
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Teja
తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
Pelli Sandadi
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
ఓటీటీ:యూట్యూబ్
Swathi Muthyam
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
ఓటీటీ: జియో టీవీ
Dhruva
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
KGF 2
రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
Baadshah
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: యూట్యూబ్
Pushpa
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
Nannaku Prematho
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
Ala Modalaindi
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Sir
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
Jersey
అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: జీ5
Hit: The First Case
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Aditya 369
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
Aha Naa Pellanta
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Vikram Vedha
వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ: ప్రైమ్
Bro
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Khaidi
ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
Uppena
మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్ తేజ్) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Geetha Govindam
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
Acharya
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
Rang De
అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5
ఓటీటీ: ప్రైమ్
Induvadana
వాసు (వరుమ్ సందేశ్) ఫారెస్ట్ పోలీసాఫీసర్. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Maharshi
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Aakaasam Nee Haddhu Ra
సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Ala Vaikunthapurramuloo
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Munna
కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
RRR
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
Dear Comrade
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Jathi Ratnalu
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Dirty Hari
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
ఓటీటీ: ఆహా
Arjun Reddy
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా, ప్రైమ్
Rangasthalam
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
జూన్ 25 , 2024
SS Rajamouli: రాజమౌళిపై స్పెషల్ డాక్యుమెంటరీ.. ఎలివేషన్స్ ఇవ్వనున్న ఆ స్టార్ హీరోలు!
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటాడు. ఆయన తీసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలు.. సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఆస్కార్‌తో పాటు పలు గ్లోబల్ స్థాయి పురస్కారాలను అందుకుంది. ‘RRR’ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఆస్కార్ కమిటీ నుంచి సైతం రాజమౌళికి ఆహ్వానం అందింది. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌లోకి రానుంది.
‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో..
దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (MODERN MASTERS) పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో మోడ్రన్ మాస్టర్స్ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్‌ఫ్లిక్స్ సంస్థ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నట్లు తెలిపింది.
View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
స్టార్ సెలబ్రిటీల కామెంట్స్!
'మోడ్రన్ మాస్టర్స్' డాక్యుమెంట్‌లో రాజమౌళి గొప్పతనం గురించి పలువురు స్టార్ సెలబ్రిటీలు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్స్ జేమ్స్ కామెరాన్, జో రోసో రాజమౌళి దర్శకత్వ నైపుణ్యం గురించి చెబుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు తమ ఒపినీయన్స్ షేర్ చేసుకుంటారని సమాచారం. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్‌ను స్టార్టింగ్ నుంచి చూపిస్తారా? లేదా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ గురించి మాత్రమే ప్రస్తావిస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఆగస్టు 2న స్పష్టత రానుంది.
ఆస్కార్ కమిటీకి రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్ అయినట్లు ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.
జూలై 06 , 2024