• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్‌-10 తెలుగు హీరోలు వీరే!

  భారత్‌లో అతిపెద్ద వినోద రంగంగా సినిమాలను చెప్పుకోవచ్చు. దేశంలో సినీ హీరోలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ సెర్చ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2023గాను నెటిజన్లు విపరీతంగా శోధించిన పలువురు టాలీవుడ్‌ హీరోల జాబితా బయటకొచ్చింది. వారిలో టాప్‌-10 హీరోలు ఎవరు? వారు ఏ కారణం చేత ఎక్కువగా శోధించబడ్డారు? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 

  ప్రభాస్‌ 

  సినీ ప్రేక్షకులు ఎక్కువగా శోధించిన టాలీవుడ్‌ హీరోలలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావడం, లేటెస్ట్‌ మూవీ సలార్‌ సైతం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రభాస్‌ ఆటోమేటిక్‌గా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోగా నిలిచారు. 

  జూ.ఎన్టీఆర్‌

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో జూ.ఎన్టీఆర్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దేవర’ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తారక్, ఆయన నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్‌ విపరీతంగా సెర్చ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ జాబితాలో తారక్ రెండో స్థానంలో నిలిచాడు. 

  అల్లు అర్జున్‌

  పుష్ప సినిమా ద్వారా దేశంలోని సగటు సినీ ప్రేక్షకుడికి అల్లు అర్జున్‌ దగ్గరయ్యాడు. ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా బన్నీ నిలిచాడు. అటు బన్నీ నటిస్తున్న పుష్ప-2 నుంచి పోస్టర్‌, టీజర్‌ వంటి అప్‌డేట్స్‌ రావడంతో బన్నీ మరింత పాపులర్ అయ్యాడు. అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.

  మహేష్‌ బాబు

  నెట్టింట ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌ బాబు నాల్గో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు రిలీజ్‌ అవుతుండటంతో మహేష్‌ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది. 

  రామ్‌ చరణ్‌

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో రామ్‌చరణ్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాలో చెర్రీ నటిస్తున్నాడు. 

  పవన్‌ కల్యాణ్‌

  టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ పవన్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో పవన్‌ సినిమాల గురించే కాకుండా పొలిటికల్‌గానూ ఆయన సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువ మంచి సెర్చ్‌ చేస్తున్నారు. 

  విజయ్‌ దేవరకొండ

  తెలుగులో మోస్ట్‌ పాపులర్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. అర్జున్‌ రెడ్డితో విజయ్ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఆయన నటించిన ఖుషి చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. 

  నాని

  నేచురల్‌ స్టార్‌ నాని గురించి కూడా 2023 ఏడాదిలో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఆయన నటించిన దసరా చిత్రం ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇటీవల ‘హాయ్‌ నాన్న’ సినిమాతోనూ మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకున్నాడు. 

  చిరంజీవి

  జయాపజాయలతో సంబంధం లేని మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. ఆయన గురించి కూడా ఈ ఏడాది చాలా మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్‌’ మాత్రం ఫ్యాన్స్‌ను అకట్టుకోవడంలో విఫలమైంది.

  రవితేజ

  మాస్‌ మహారాజు రవితేజ తెలుగు స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రవితేజ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv