• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్‌స్టాప్‌? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్‌! 

    మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్‌ బాబు, మనోజ్‌ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇంటి వద్ద నెలకొన్న ఘర్షణ పరిస్థితులు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఆదివారం (డిసెంబర్‌ 8) మెుదలైన ఈ వ్యవహారం బుధవారం (డిసెంబర్‌ 11) సాయంత్రం వరకు దాదాపు నాలుగు రోజుల పాటు రచ్చ చేస్తూనే వచ్చింది. రాచకొండ సీపీ సుదీర్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పడింది. బుధవారం మంచు మనోజ్‌తో పాటు సోదరుడు మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ ఇవ్వడంతో వివాదానికి కేంద్రమైన హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పడింది.

    షూటింగ్‌కు వెళ్లిన మనోజ్‌..

    తండ్రి మోహన్‌బాబుతో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌ గత నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గాయాలతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపై రాచకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, తనకు జరిగిన అన్యాయంపై వరుస ప్రెస్‌మీట్లతో ప్రజలకు తెలియజేయడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అటువంటి మనోజ్‌ బుధవారం రాచకొండ సీపీ సుదీర్‌ బాబు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వివాదానికి తాత్కాలికంగా చెక్‌ పెట్టారు. గురువారం సినిమా షూటింగ్‌కు ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్‌ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో మనోజ్‌ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. ఇటీవల నారా రోహిత్‌ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. 

    తముళ్లకు మంచు లక్ష్మి కౌంటర్‌..

    మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేసినప్పటికీ మంచు లక్ష్మీ ఎక్కడా ఈ వివాదంలో తలదూర్చలేదు. పైగా సోదరులు ఇద్దరు మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే మంచు లక్ష్మీ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంతటితో ఊరుకోకుండా నెట్టింట పరోక్ష కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ప్రవచనాన్ని గురువారం ఉదయం మంచు లక్ష్మీ పోస్టు చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు? అని మంచు లక్ష్మీ కొటేషన్‌ పెట్టింది. సోదరులు ఇద్దరు ఆస్తుల కోసం గొడవపతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె సూక్తి పెట్టినట్లు అర్ధమవుతోంది. 

    మోహన్‌ బాబుపై హత్య కేసు

    మీడియాపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సీనియర్ నటుడు మోహన్‌పై హత్య కేసు నమోదైంది. మోహన్‌ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొలుత మోహన్‌ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని పెద్దఎత్తున్న జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మరోమారు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలను పరిశీలించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్‌ 109 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసును పెట్టారు. దీనికి సంబంధించి త్వరలో మోహన్‌బాబును పోలీసులు విచారించే అవకాశముంది. 

    ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు’

    మంచు మనోజ్‌ చేసిన ఫిర్యాదులో భాగంగా రాచకొండ సీపీ కార్యాలయానికి గురువారం సాయంత్రం మంచు విష్ణు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా జరిగిన మంచు కుటుంబం వివాదాలపై సీపీ సుదీర్‌ బాబు ఆరా తీశారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడ్డవద్దని సూచించారు. సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, గొడవలు చేయవద్దని చెప్పారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్న సరే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇకపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిలే వ్యవహరిస్తే లక్షరూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv