భారతీయ మార్కెట్లో నోకియా బ్రాండ్‌కు ఎంతో ఆదరణ ఉంది. తాజాగా నోకియా నుంచి మార్జినల్ బడ్జెట్లో ఓ క్లాసిక్ మొబైల్ విడుదలైంది. నోకియా 105 క్లాసిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చింది. ఇది ఇన్‌బిల్ట్ UPI అప్లికేషన్‌తో వచ్చింది. ఒక ఏడాది రీప్లేస్మెంట్ వారెంటీతో లభిస్తోంది.
నోకియా 105 క్లాసిక్ ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంది. స్మూత్ అండ్ స్టైలీష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది. గ్లాసీ ఫినిషింగ్‌తో చేతుల్లో హ్యాండీ ఉంటుంది.
అన్నిరకాల 2G నెట్‌వర్క్‌లను ఈ గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. నోకియా 105 క్లాసిక్ 800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వైర్లెస్ ఎఫ్ఎం రేడియో ఫీచర్ కూడా ఈ ఫోన్లో అందుబాటులో ఉంది.
ఈ నోకియా ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. బ్లూ, చార్కోల్ రంగుల్లో లాంచ్ చేయబడింది. బ్లూ కలర్ ఎక్కువగా అట్రాక్ట్ అయితే చేస్తోంది.
ఈ ఫోన్ తయారీ వెనుక ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ పేమెంట్ లావాదేవీలను మరింత సులభతరం చేయడమని నోకియా తెలిపింది. మార్జినల్ సెక్టార్లో ఉన్న ప్రజలకు ఆర్థిక లావాదేవీలను ఈ ఫోన్ తేలిక చేస్తుందని వెల్లడించింది. ఇందుకోసం ఈ ఫోన్లో అంతర్నిర్మితమైన UPI అప్లికేషన్‌ను ఇస్తుండటం గమనార్హం.
ఇది అన్నిరకాల యూపీఐ ట్రాన్సాక్షన్లను సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌పై నోకియా కంపెనీ అయితే ఏడాది రీప్లేస్వారెంటీ గ్యారెంటీని అందిస్తోంది.
ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్, ఛార్జర్‌తో కలిపి, ఛార్జర్ లేకుండా నోకియా 105 మోడల్‌ను అయితే కొనుగోలు చేయవచ్చు.
నోకియా 105 క్లాసిక్ ప్రారంభ ధర రూ.999 ఉండనున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్ ఫోన్ పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా విడుదల చేయలేదు.
కాగా ఈ ఏడాదిలోనే నోకియా యూపీఐ 123పే సపోర్ట్‌తో విడుదలైన సంగతి తెలిసిందే. దీని ధర రూ.1,299. ఇది చార్కోల్, సియాన్, ఎరుపు రంగుల్లో లభిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!