ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్బాస్టర్ పక్కా’
పవన్ – సుజిత్ కాంబోలోని ‘ఓజీ’ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో మనం త్వరలోనే కలుద్దాం’ అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్డేట్స్తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం