సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.
ధూం ధాం (Dhoom Dhaam)
చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్.రామ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చారు.
ఉత్సవం (Utsavam)
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు‘. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్‘. 2018లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
ఆయ్ (Aay)
నార్నే నితిన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.
తలవన్ (Thalavan)
జిస్ జాయ్ దర్శకత్వంలో బిజు మేనన్, ఆసిఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Sector 36 | Movie | Hindi | Netflix | Sept 13 |
Breaking Down The Wall | Documentary | English | Netflix | Sept 12 |
Emily In Paris S4 | Series | English | Netflix | Sept 12 |
Midnight At The Pera Palace S2 | Series | English | Netflix | Sept 12 |
Uglies | Movie | English | Netflix | Sept 13 |
Thangalaan | Movie | Telugu/Tamil | Netflix | Sept 20 |
The Money Game | Documentary | English | Amazon | Sept 10 |
Stree 2 | Movie | Hindi | Amazon | Sept 27 |
Berlin | Movie | Hindi | Zee 5 | Sept 13 |
Nunakiji | Movie | Malayalam | Zee 5 | Sept 13 |
Bench Life | Series | Telugu | SonyLIV | Sept 12 |
Goli Soda Raising | Movie | Tamil | Hotstar | Sept 13 |
How To Die Alone | Movie | English | Hotstar | Sept 13 |
In Vogue: The 90s | Documentary | English | Hotstar | Sept 13 |
Kalbali Records | Movie | Hindi | Hotstar | Sept 12 |
Late Night With Devil | Movie | English | Lions Gate | Sept 13 |
Visfot | Movie | Telugu | Jio Cinema | Sept 7 |
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?