టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు.
అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్ లెగ్ ట్యాగ్ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.
‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తనపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం