ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే స్క్రీన్స్‌పై చూసేవాళ్లకు రియల్‌గా అనిపిస్తుంటుంది. యాక్షన్ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరుశురాముడిగా ప్రభాస్!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్‌కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్‌ను కూడా కలిసినట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
విలన్స్‌గా స్టార్ కపుల్స్
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్’లో కరీనా కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్ లైఫ్‌లో కపుల్స్ అయిన కరీనా, సైఫ్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్స్‌గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్‌తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?