Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌! 

    Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌! 

    May 1, 2024

    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. 

    పవర్‌ఫుల్‌ టైటిల్‌ సాంగ్‌!

    పుష్ప చిత్రం సూపర్ సక్సెక్‌ కావడంతో త్వరలో రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ రిలీజ్‌ కాగా ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో ఈ సాంగ్‌ను రూపొందించారు. ‘పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్’  అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది. 

    గాజు గ్లాస్‌తో స్టెప్పులు

    పుష్ప 2 నుంచి రిలీజైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌తో కావాలనే ఈ స్టెప్స్‌ క్రియేట్‌ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలానే ఉంది.

    రిలీజ్ ఎప్పుడంటే?

    పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version