చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ రియల్మీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివిధ 5జీ స్మార్ట్ఫోన్ల (Realme 5G smartphones)పై రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. రియల్మీ 5జీ సేల్ (Realme 5G Sale) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇటీవల లాంచ్ చేసిన రియల్మీ నార్జో 60x, రియల్మీ 11 5జీ, రియల్మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్‌లో 5జీ ఫోన్ కొనుగోలు చేసిన వారు గరిష్ఠంగా రూ.12,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
Realme Narzo 60x
రియల్మీ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంది. రియల్మీ నార్జో 60x 5జీ (Realme Narzo 60x 5G) ఫోన్‌పై రూ.1,000 తక్షణ రాయితీ లభిస్తోంది. డిస్కౌంట్ పోనూ ఈ ఫోన్ రూ.11,999కి లభించనుంది. అదనంగా రూ.279 విలువ చేసే కాయిన్స్ రివార్డుగా వస్తాయి. అలాగే ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.250 డిస్కౌంట్ ఇస్తోంది. ఆరు నెలల పాటు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను స్టెల్లార్ గ్రీన్, నెబ్యులా పర్పుల్ రంగుల్లో పొందొచ్చు. ఈ ఫోన్ ఇవాళే విడుదల కావడం విశేషం.
Realme 11 series
రియల్మీ 11 సిరీస్‌లోని Realme 11 5G, Realme 11 Pro, Realme Pro+పై స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, రాయితీ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో Realme 11 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రియల్మీ 11 ప్రో (Realme 11Pro), రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11Pro Plus) మోడల్స్‌పై రూ. 2 వేల వరకు తగ్గింపు లభించనుంది. అలాగే అన్ని రకాల 5G మెుబైల్స్‌పై No Cost EMI ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లు రియల్మీ తన వెబ్సైట్లో పేర్కొంది. రియల్మీ 11 ప్రో ధర రూ. 21,999 కాగా, 11 ప్రో ప్లస్ ధర రూ. 25,999గా ఉంది.
Realme 11X 5G
రియల్మీ 11X 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా నో కాస్ట్ EMI ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ, Realme 5G సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి తగ్గింపు లేకపోవడం కాస్త నిరాశ పరిచేదే. రియల్మీ 11ఎక్స్ 5జీ 6GB+128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. అదే విధంగా 8GB+128GB స్టోరేజీ ఉండే ఫోన్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది.
ఇదే మంచి ఛాన్స్..!
మీడియం రేంజ్ బడ్జెట్లో మంచి ఫీచర్లున్న 5జీ స్మార్ట్ ఫోన్ కోరుకునేవారికి ‘రియల్మీ 5జీ సేల్’ మంచి ఛాన్స్. రియల్మీ ప్రకటించిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే బెటర్. సెప్టెంబర్ 17 వరకే ఈ సేల్ ఉండనున్న నేపథ్యంలో ఈ లోపే మీకు నచ్చిన మెుబైల్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’