• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme Note 50: రియల్‌మీ నుంచి సరికొత్త బడ్జెట్‌ ఫోన్.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ కంపెనీల్లో రియల్‌మీ (Realme) ఒకటి. ఈ సంస్థ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లకు టెక్‌ ప్రియుల్లో చాలా క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రియల్‌మీ మరో సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌ను మన ముందుకు తీసుకొస్తోంది. ‘Realme Note 50’ పేరుతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. జనవరి 23న ఈ ఫోన్‌ను వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

    మెుబైల్‌ స్క్రీన్‌

    Realme Note 50 స్మార్ట్‌ఫోన్‌.. 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్‌ రేటును దీనికి అందించారు. Android 13 ఆధారిత Realme UI T ఎడిషన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఫోన్‌ వర్క్ చేయనుంది. 167.7×76.67×7.99mm కొలతల్లో ఫోన్‌ రానుంది.

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ రియల్‌మీ మెుబైల్‌ 4GB RAM /  64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతున్నట్లు లీకైనా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వీలు ఉంది. 

    కెమెరా

    Realme Note 50 మెుబైల్‌.. డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వస్తున్నట్లు విడుదలైన టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఫోన్‌ వెనక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాతో పాటు సపోర్టింగ్‌ సెన్సార్‌ ఉండనుంది. ఇక ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు.

    బ్యాటరీ

    ఈ ఫోన్‌ శక్తివంతమైన బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. Realme Note 50 మెుబైల్‌కు 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు కలిగిన 5,000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని రియల్‌మీ వర్గాలు తెలిపాయి.

    కలర్ ఆప్షన్స్‌

    Realme Note 50 మెుబైల్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో పొందవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌ (Midnight Black), స్కై బ్లూ (Sky Blue) రంగుల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    గతంలో తీసుకొచ్చిన Realme C51 మెుబైల్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా Realme Note 50ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్‌ ధరను లాంచింగ్‌ రోజునే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నాయి. అయితే Realme Note 50 ఫోన్‌ ధర రూ.6,000 వరకూ ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై జనవరి 23న స్పష్టత వస్తుంది. 


    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv