SSMB 29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB 29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!

    SSMB 29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!

    March 26, 2024

    ప్రముఖ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu), అగ్రదర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక్క ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఆయన హీరోగా మహేష్‌ను ఒక్కరినే ఫైనల్‌ చేసినట్లు చెప్పారు. మిగతా నటీనటుల కోసం కసరత్తు జరుగుతోందని చెప్పి ఊరుకున్నారు. అయితే తాజాగా SSMB29 ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది చూసిన ఫ్యాన్స్‌కు నిరాశ చెందుతున్నారు. 

    మరింత ఆలస్యం!

    మహేష్‌ రాజమౌళి కాంబోలో సినిమా రానున్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దీనిపై ఇంతవరకూ మేకర్స్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించలేదు. అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన ఏప్రిల్ 9న ఉగాది కానుకగా ఉంటుందని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌లో కాకుండా మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ చేయాలని దర్శకుడు రాజమౌళి & టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్‌ కోసం ఆగాల్సిందేనని అంటున్నారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. ఇలా ఎన్ని రోజులు వెయిట్‌ చేయిస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 

    ఆ భామకు ఛాన్స్‌ దక్కిందా?

    ‘SSMB 29’ సినిమాలో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌కు జోడీగా అలియా భట్‌ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్‌ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్‌ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్‌ నటి చెల్సియా ఇస్లాన్‌ కూడా ‘SSMB 29’ చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.

    SSMB 29.. టైటిల్‌ ఇదేనా?

    దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే ‘SSMB 29’ సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్‌ చిత్రానికి ‘మహారాజ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ పేరులో మహా.. రాజమౌళిలలో ‘రాజ’ తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్‌ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version