ప్రముఖ కొరియన్ కంపెనీ శాంసంగ్ (Samsung) సరికొత్త ల్యాప్‌టాప్‌తో భారత్‌లో అడుగు పెట్టబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్’ (Samsung Galaxy Book 4 Series) పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ల్యాప్‌టాప్ గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. అతి త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ ఇది లభించనుంది. ఇందుకు అనుగుణంగా ‘Samsung Galaxy Book 4’ ప్రీ బుకింగ్స్‌ను కూడా కంపెనీ నేటి నుంచి ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నయా ల్యాప్‌టాప్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
మూడు వేరియంట్లలో..
Samsung Galaxy Book 4 Series నుంచి మూడు వేరియంట్లలో ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. గెలాక్సీ బుక్ 4 ప్రో (Galaxy Book 4 Pro), గెలాక్సీ బుక్ 4 ప్రో 360 (Galaxy Book 4 Pro 360), గెలాక్సీ బుక్ 4 ప్రో అల్ట్రా (Galaxy Book 4 Ultra) మోడళ్లలో ల్యాప్‌టాప్ లభించనుంది. ప్రస్తుతం గెలాక్సీ బుక్ 4 ప్రో, గెలాక్సీ బుక్ 4 ప్రో 360 ల్యాప్‌టాప్‌ల ప్రీ బుకింగ్స్‌ను మాత్రమే కంపెనీ ఆహ్వానిస్తోంది.
ల్యాపీ స్క్రీన్
Galaxy Book 4 Pro, Book 4 Pro 360 ల్యాప్‌టాప్‌లు.. వరుసగా 14, 16 అంగుళాల AMOLED WQXGA+ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. 1,800×2,880 pixels క్వాలిటీ, 120Hz రిఫ్రెష్ రేటు, 400 nits పీక్ బ్రైట్‌నెస్‌ను డిస్‌ప్లేకు అందించారు. Intel Core Ultra 7 లేదా Intel Core Ultra 5 ప్రొసెసర్‌తో ఇవి భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది. ‘Arc graphics’ ఫీచర్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఈ నయా ల్యాప్‌టాప్ ‘Windows 11 Home’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నాయి. ఇది బిజినెస్ టైప్ ల్యాప్‌టాప్. 1.23 Kg,312.3 x 223.8 x 11.6 mm కొలతలు, 1.23 కేజీల బరువును ఈ శాంసంగ్ ల్యాప్‌టాప్ కలిగి ఉంది.
స్టోరేజ్ ఆప్షన్
Galaxy Book 4 Series.. 16GB / 32GB RAM, 256GB / 512GB / 1TB NVMe SSD స్టోరేజ్‌తో రానుంది. MicroSD స్లాట్ సౌకర్యం కూడా ఈ ల్యాప్‌టాప్‌కు అందించారు. దీని ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు వీలు పడుతుంది.
గేమింగ్ ఎక్స్‌పీరియన్స్
ఈ శాంసంగ్ ల్యాప్‌టాప్ AI ఆధారిత ‘NVIDIA స్టూడియో టెక్నాలజీ’తో రూపొందింది. ఇది నాణ్యమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. ల్యాప్‌టాప్‌లోని DLSS టెక్నాలజీ హైయర్ ఇమేజ్ క్వాలిటీని అందిస్తాయి. భారీ స్టోరేజ్‌తో వచ్చే గేమ్స్‌ను సైతం ఈ ల్యాప్‌టాప్ హ్యాండిల్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
వెబ్ కెమెరా
వెబ్ సెమినార్లు, ఆన్‌లైన్ ఇంటర్యూలకు ఉపయోగపడేలా ఈ ల్యాప్‌టాప్‌లో 2MP వెబ్ కెమెరాను ఫిక్స్ చేశారు. దీని సాయంతో స్పష్టమైన వీడియో కాల్ క్వాలిటీని పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఈ ల్యాప్‌టాప్‌ను కొన్నవారు వెబ్‌క్యామ్ ఫీచర్‌కు మంచి మార్కులే ఇచ్చారు.
బ్యాటరీ
Samsung Galaxy Book 4 Series.. సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో రానుంది. దీనికి 76Wh బ్యాటరీని అందించారు. 65W వైర్‌డ్ ఛార్జింగ్ సపోర్టును ఇది కలిగి ఉంది. 55 శాతం ఛార్జింగ్ కావడానికి ఈ ల్యాప్‌టాప్ 30 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుందని శాంసంగ్ వర్గాలు వెల్లడించాయి.
రీసైకిల్డ్ మెటిరీయల్స్
శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్స్‌ని రీసైకిల్డ్ మెటిరీయల్స్తో తయారు చేశారు. అల్యూమినియం, గ్లాస్, ప్లాస్టిక్‌తో పాటు ఇతర మెటీరియల్స్ని తయారీ కోసం ఉపయోగించారు. దీని వల్ల ల్యాప్‌టాప్స్ దృఢంగా ఉండటంతో పాటు ఆకర్షణీయమైన లుక్‌ను కలిగి ఉన్నాయి.
అడిషనల్ ఫీచర్లు
ఈ గెలాక్సీ బుక్4 సిరీస్‌లోని ల్యాప్‌టాప్స్‌లో క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, ఏఐ అసిస్టెడ్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ మైక్రోఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ ఎల్ఈ ఆడియో, బ్లూటూత్ 5.3, Wi-Fi 6E, HDMI 2.1 port, Pro Keyboard వంటి ఫీచర్స్‌ను కూడా ఈ శాంసంగ్ ల్యాప్‌టాప్స్ కలిగి ఉంది.
ధర ఎంతంటే?
Samsung Galaxy Book 4 సిరీస్ ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే Book 4 Pro 360 ధర రూ.1,29,900గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. Galaxy Book 4 Pro ధర Pro 360 కంటే కాస్త తక్కువే అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కొద్ది గంటల క్రితమే ప్రారంభమయ్యాయి. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు స్టోర్లలో రూ.1,999 చెల్లించి ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్ చేస్కున్న వారికి రూ.5000 వరకూ రాయితీ పొందవచ్చని శాంసంగ్ ప్రకటించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!