ప్రశాంతంగా మునుగోడు పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఇప్పటివరకు 11.4శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు మునుగోడులోని చండూరులో భారీగా మద్యం బాటిళ్లు, డబ్బును ఎలక్షన్ అబ్జర్వర్స్ సీజ్ చేశారు.