ఆల్ టైమ్ కనిష్టానికి జొమాటో షేర్లు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు ఇవాళ రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర సంస్థల లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో సోమవారం ఉదయం జొమాటో షేర్లు దిగజారాయి. ప్రారంభ ట్రేడింగ్లో షేర్లు దాదాపు 14 శాతం క్షీణించాయి. ఈ క్రమంలో షేర్ ధర ఒక దశలో రూ.46.8కు చేరి తర్వాత క్రమంగా పెరిగింది.