ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందిన అమర్ సింగ్‌కు అస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో అమర్‌సింగ్‌ను సత్కరించారు. వరదలు, కరవు, కార్చిచ్చులు, కరోనా వంటి విపత్తులు తలెత్తిన సమయంతో చేసిన సేవలకు గానూ ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. టర్బన్స్ ఫర్ ఆస్ట్రేలియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన అమర్ సింగ్, దాని ద్వారా ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు.