వేరుశనగలు.. ఆరోగ్యానికి మేలు..!
వేరుశనగ కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పోషక గుణాల వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందిని చెబుతున్నారు. అంతేగాకుండా, ఎముకలకు పటుత్వం, కండరాలకు బలం చేకూర్చే గుణాలు వేరుశనగలో ఉన్నాయంటున్నారు. క్యాన్సర్ని నివారించడంలోనూ, రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే, పచ్చివి, నూనెలో వేయించినవి తింటే లాభం లేదని చెబుతున్నారు. అయితే, మీ శరీర స్థితిని బట్టి తీసుకోవడం మంచిది. కొందరికి వేరుశనగ చేటు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.