ఆర్మీ రిక్రూట్మెంట్లో కీలక మార్పు
అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పు చోటు చేసుకుంది. తొలుత కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని నిర్వహించనున్నట్లు ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం మొదట ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టులను నిర్వహిస్తోంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల రద్దీ ఏర్పడుతోంది. అంతేగాకుండా అభ్యర్థులకూ వ్యయప్రయాసలు ఎక్కువవుతున్నాయి. దీన్ని నివారించడానికి తొలుత స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనుంది. అనంతరం పరీక్షలో ఎంపికైన వారికి ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. 2023-24 రిక్రూట్మెంట్కి ఇది వర్తించనుంది.