ఆటో రామ్ ప్రసాద్ పిప్ షో మూవీ టీజర్ విడుదల
‘జబర్దస్త్’ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ మొదటి సారి హీరోగా యాక్ట్ చేసిన పిప్ షో మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో హీరో హీరోయిన్ బట్టలు విప్పుతుండగా దొంగచాటుగా చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కన్నీరు కార్చడం చూడవచ్చు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీస్తున్నట్లు డైరెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సినిమాలో సహదేశ్ పాండే కథానాయిక కాగా, ఎస్సార్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైందని, పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టీం తెలిపింది.