పోలీస్‌కే చలాన్.. ట్విస్ట్
తోటి పోలీస్‌కు చలాన్ విధించిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులోని ఆర్టీ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పోలీస్ నిషేధించిన హాఫ్ హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నందుకు ఈ జరిమానా విధించాడు తోటి పోలీస్. జరిమానా విధించిన పోలీస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చలానా విధించిన ఫొటోను బెంగళూరు పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.