మంత్రి పువ్వాడకు మంత్రి బొత్స గట్టి కౌంటర్
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘటుగా స్పందించారు. ఏపీలో కలిపిన ఖమ్మం ముంపు గ్రామాల పరిస్థితి తాము చూసుకుంటామన్నారు. మీ ప్రాంత ప్రజల సంగతి మీరు చూసుకోవాలని బొత్స హితవు పలికారు. పిచ్చిపిచ్చి మాటలు వద్దని బాధ్యతగా మాట్లాడని సూచించారు. మరోవైపు హైదరాబాద్ ను ఏపీలో కలపుతారా అని ప్రశ్నించారు. అందుకు మాకు సమ్మతమేనన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం వరదలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.