నేటి నుంచి CPGET వెబ్ కౌన్సెలింగ్
తెలంగాణలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(CPGET) వెబ్ కౌన్సెలింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించారు. 28 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతుండగా, అక్టోబర్ 12 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక అక్టోబర్ 18న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 24 నుంచి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 8 వర్సిటీల పరిధిలో 320 కాలేజీలు ఉండగా, మొత్తం 44,871 సీట్లు అందుబాటులో ఉన్నాయి.