ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇక అప్రమత్తంగా ఉండండి. ఏ క్షణమైనా మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్‌కి గురికావొచ్చు. ఫోన్లలోని గ్రాఫిక్స్ ప్రాసెంసింగ్ యూనిట్(GPU)లో ఓ బగ్ ఉండటమే దీనికి కారణమట. ఈ విషయాన్ని గుర్తించిన గూగుల్ సంస్థ పరిశోధకులు తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని లక్షల ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతిలో పడే ముప్పు ఉందని హెచ్చరించారట. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తగా తగు నిబంధనలు పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.