గరికపాటి వ్యాఖ్యలపై RGV ట్వీట్
చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. తాజాగా ఈ ఘటనపై రామ్‌గోపాల్‌వర్మ స్పందించాడు. గరికపాటిని ఎద్దేవా చేస్తూ మూడు ట్వీట్లు చేశాడు. నాగబాబు క్షమించినా.. మెగా అభిమానులమైన తాము గరికపాటిని వదిలిపెట్టబోమని ట్వీట్లలో తెలిపాడు. అయితే, ఈ ట్వీట్లను గమనిస్తే అటు మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచినట్లు, ఇటు గరికపాటిని పూర్తిగా నిందించినట్లు కనిపించడం లేదు. ట్వీట్లు అస్పష్టంగా ఉండటంతో ఈ సందేహం తలెత్తుతోంది.