‘ఆదిపురుష్ కన్నా ‘హను-మాన్’ టీజరే బాగుంది’
యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘హను-మాన్’ చిత్రం టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్‌ను నెటిజన్లు ఆదిపురుష్ టీజర్‌తో పోలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఆదిపురుష్ కంటే హనుమాన్ టీజర్ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్లో విజువల్స్ అదుర్స్ అని పొగిడేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.