• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో రికార్డు సాధించిన SKY

    టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(SKY) మరో ఘనత సాధించాడు. 2022లో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ ఫీట్‌ని అందుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు పాక్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్(825) పేరిట ఉంది. గురువారం SKY రిజ్వాన్‌ని అధిగమించాడు. మరోవైపు, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్సులో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా తనదైన ఆటతీరుతో పరుగులు సాధించడం SKY సొంతం.

    పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ దూకుడు

    టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డును భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టేసి నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. మొత్తం 3,694 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత కోహ్లి 3,660 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 3,497 పరుగులతో నిలిచాడు. ఇక 3,011 పరుగులతో ఐర్లాండ్ హిట్టర్ పాల్ స్టిర్లింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ 2,939 … Read more