హిజాబ్ ధరించేలా ‘బ్రిటీష్’ యూనిఫాం
దాదాపు 20 ఏళ్ల తర్వాత బ్రిటీష్ ఎయిర్వేస్ తమ విమాన సిబ్బంది కోసం కొత్త యూనిఫాం ప్రవేశపెట్టింది. కేబిన్ క్రూలోని మహిళా సిబ్బంది హిజాబ్ ధరించేలా యూనిఫాం డిజైన్ చేయించింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే విధంగా తయారు చేశారు. ప్రముఖ డిజైనర్ బోటెంగ్ ఈ యూనిఫాం డిజైన్ చేశారు. బ్రిటీష్ ఎయిర్వేస్లో మొత్తం 30 వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరందరికీ ఈ యూనిఫాం అందజేయనున్నారు. కొత్త యూనిఫాం ఆధునిక బ్రిటన్ను సూచిస్తుందని సీఈఓ డోయల్ పేర్కొన్నారు.