• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డేటింగ్‌ యాప్‌లో రూ.98 వేలు మోసపోయిన విద్యార్థి

  డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఓ మహిళ ద్వారా 25 ఏళ్ల ఓ విద్యార్థి రూ.98,400 పోగొట్టుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన బాధితుడు ఆగస్టు 20న తెలుగు డేటింగ్ యాప్‌ ‘నీతో’లో అంజలి అనే అమ్మాయితో చాట్ చేశాడు. ఆ క్రమంలో వీరిద్దరు వాట్సాప్ నంబర్‌లను మార్చుకున్నారు. తర్వాత ఆమె ఓ రోజు అతనికి నగ్న వీడియో కాల్ చేస్తూ, అతని ముఖం కనిపించేలా వీడియోను రికార్డ్ చేసింది. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని లేకుంటే వీడియో వైరల్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. విద్యార్థి … Read more

  రైతులు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలి: KCR

  వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో రైతు ఐక్య సంఘటనను నిర్మిద్దామని, రైతులు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని, చట్టసభలకు పంపిస్తామని పేర్కొన్నారు. 26 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన జాతీయ రైతు సంఘాల నేతలతో ఆదివారం కేసీఆర్ రెండో రోజు సమావేశమయ్యారు. దేశంలో రైతుల సమస్యలు, సంక్షేమం సహా పలు అంశాలపై కేసీఆర్ చర్చించారు. ఈ … Read more

  కేంద్రం తీరుపై మళ్లీ మండిపడ్డ కేటీఆర్

  కేంద్రం తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఏం తినాలో, ఏం వినాలో కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు పెరిగి దేశంలో దారుణ పరిస్థితి నెలకొందన్నారు. సమస్యల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ మెటీరియల్ పంపిణీ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలే లక్ష్యం ఏర్పడ్డ తెలంగాణను 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

  40 శాతం పెరిగిన గణేశ్ విగ్రహాల ధరలు

  ఈసారి గణేశ్ విగ్రహాల ధరలు హైదరాబాద్‌లో 40 శాతం పెరిగాయని తయారీదారులు అంటున్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విగ్రహాలు తయారు కాలేదని, అందుకే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కోవిడ్ కారణంగా గత రెండుళ్లుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయని, దీంతో తక్కువగా తయారుచేసినట్లు చెప్పారు. కానీ ఈసారి మాత్రం భక్తులు పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వస్తున్నట్లు వెల్లడించారు. వినాయక చవితి పండుగ ఆగస్టు 31న మొదలు కానుంది.

  అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ లంచ్!

  ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ పక్కన గల నోవాటెల్ హోటల్లో వీరిద్దరు సాయంత్రం లంచ్ చేయనున్నట్లు తెలిసింది. అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ లంచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో భీం పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందని గతంలో అమిత్ షా పేర్కొన్నారు.

  ఏపీ ఎంపీ రఘరామపై కేసు నమోదు

  ఏపీ ఎంపీ రఘరామపై కేసు నమోదు ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ఆ కానిస్టేబుల్ పై ఎంపీ రఘరామ భద్రాత సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్

  Categories AP

  ఈ మహిళలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న భర్తలు

  దేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను పలువురు దుర్వనియోగం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంత మంది భార్యలు డబ్బుల కోసం భర్తలపై వేధింపుల కేసులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తమకు లింగ సమానత్వం కావాలని తెలిపారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా 200 మంది పురుషులు పాల్గొన్నారు. మహిళలు తమపై పలు రకాల కేసులు పెట్టినపుడు అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని పురుష బాధితులు కోరుతున్నారు. మరోవైపు వరకట్నం కేసులు కూడా పెట్టి ఆర్థికంగా … Read more