• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలీవుడ్ వైపు పూరి చూపు ?

  విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో ప్రకటించిన ‘JGM’ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఫ్లాపుతో పూరి తన తరువాతి ప్రాజెక్ట్ ఎవరితో చేయాలనే సందిగ్ధంలో పడిపోయాడు. 11 ఏళ్ల క్రితం వరుస ఫ్లాపులతో సతమవుతున్న పూరి బాలీవుడ్‌లో అమితాబ్‌తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ అనే సినిమా చేసి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నాడట. అయితే ‘లైగర్’ ఫ్లాప్ అవడంతో హీరోలెవరూ డేట్స్ ఇవ్వడానికి ముందుకు … Read more

  కొడుకుతో పూరి తరువాతి సినిమా ?

  విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో సినిమా ‘జన గణ మన’ నిలిచిపోయింది. అటు పూరి కొడుకు ఆకాష్ పూరి శాతం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన తరువాతి సినిమాను తన కొడుకుతో చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నాడట. మంచి స్క్రిప్ట్‌తో తాను బౌన్స్ బ్యాక్ అవ్వడంతో పాటు, తన కొడుకుకు బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో … Read more

  హ్యాపీ బ‌ర్త్‌డే యంగ్ హీరో ఆకాశ్ పూరీ

  నేడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ బ‌ర్త్‌డే. ఆకాశ్ పూరీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు. బుజ్జిగాడు, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ప‌లు సినిమాల్లో బాల‌న‌టుడిగా చేశాడు. చిన్న‌ప్ప‌టినుంచే న‌ట‌న మొద‌లుపెట్టిన‌ ఆకాశ్‌కు అప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింది. దీంతో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో మెహ‌బూబూ సినిమాతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రొమాంటిక్‌, చోర్ బ‌జార్ సినిమాలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ న‌టుడిగా ఒక్కో సినిమాకు ఆకాశ్ ప‌రిణ‌తి చెందుతున్న విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడే కెరీర్ మొద‌లుపెట్టిన ఈ యంగ్‌హీరో … Read more

  చోర్ బ‌జార్‌లో అమితాబ్ ల‌వ‌ర్‌గా సీనియ‌ర్ హీరోయిన్‌

  నిరీక్ష‌ణ సినిమాతో ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది సీనియ‌ర్ న‌టి అర్చ‌న‌. దాసి, లేడీస్ టైల‌ర్, భార‌త్ బంద్ వంటి చిత్రాల్లోనూ న‌టించింది. అయితే చాలా కాలం గ్యాప్ త‌ర్వాత ఆకాశ్ పూరీ హీరోగా న‌టించిన చోర్ బ‌జార్‌లో ఒక కీల‌క పాత్ర పోషించింది. ఇంత‌కాలం ఎందుకు సినిమాల్లో న‌టించ‌లేదు అని ఆమెను అడ‌గ్గా..హీరోయిన్ల‌కు పెళ్లి త‌ర్వాత అక్క‌, అమ్మ‌, అత్త వంటి పాత్ర‌లే వ‌స్తాయి. అలాంటి రోల్స్ కోసం న‌న్ను చాలా మంది అడిగారు. కానీ నేను నో చెప్పాను. చోర్ … Read more

  చోర్ బ‌జార్ నుంచి ‘బచ్చ‌న్ సాబ్’ సాంగ్ రిలీజ్ చేసిన ర‌వితేజ‌

  ఆకాశ్ పూరీ హీరోగా న‌టిస్తున్న ‘చోర్ బ‌జార్’ నుంచి ‘బ‌చ్చ‌న్ సాబ్’ ఫ్యాన్ ఆంథెమ్ విడుద‌లైంది. అమితాబ్‌కు పెద్ద ఫ్యాన్ అయిన‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఈ పాట‌ను రిలీజ్ చేశారు. చోర్ బ‌జార్‌లో హీరో పేరు బ‌చ్చ‌న్ సాబ్. అందుకే టైటిల్ సాంగ్ ఈ పేరుతో కంపోజ్ చేశారు. మంగ్లీ ఈ పాట పాడింది. చోర్ బ‌జార్ మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. జార్జిరెడ్డి ఫేమ్ జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తుంది. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ … Read more

  ఆకాశ్ పూరీ ‘చోర్ బ‌జార్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

  ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తున్న ‘చోర్ బ‌జార్’ చిత్రం విడుద‌ల తేది ఫిక్స్ అయింది. జూన్ 24న ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. గెహ్నీ సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తుంది. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం. జార్జిరెడ్డి ఫేమ్ జీవ‌న్ రెడ్డి దీనికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.

  ఆకాశ్ పూరీ ‘చోర్ బ‌జార్’ ట్రైల‌ర్ రిలీజ్

  ఆకాశ్ పూరీ, గెహ్న సిప్పీ జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘చోర్ బ‌జార్’. ఈ మూవీ ట్రైల‌ర్‌ను నేడు న‌ట‌సింహ బాల‌కృష్ణ విడుద‌ల చేశారు. ఆకాశ్ పూరీ బ‌చ్చ‌న్ సాబ్ అనే మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గెహ్నా సిప్పీ మూగ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాను ఏం మాట్లాడాల‌న‌కుంటుందో సినిమా డైలాగ్స్ ద్వారా వినిపిస్తుంది. జీవ‌న్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు.

  ‘చోర్ బజార్’ నుంచి మరో సాంగ్ విడుదల

  పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా, గెహన సిప్పి హీరోయిన్‌గా జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ‘చోర్ బజార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాతబస్తీ నేపథ్యంలో సాగే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా నూనూగు మీసాల పోరడు అనే పాటను విడుదల చేశారు. లక్ష్మీ మేఘన పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.