గన్ మిస్ఫైర్; తెలుగు విద్యార్థి దుర్మరణం
గన్ మిస్ ఫైరింగ్ జరిగి అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి అఖిల్ సాయి ఏడాది కిందట అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ వర్సిటీలో ఎంఎస్ చదువుతూ.. ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డు తుపాకీ తీసుకుని పరిశీలిస్తుండగా మిస్ ఫైర్ జరిగింది. తూటా అఖిల్ తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.