హీరో నితిన్, నిఖిల్ మధ్య పోటీ..గెలుపెవరిది?
జూలై 22న రిలీజ్ కావాల్సిన హీరో నిఖిల్ కార్తికేయ-2 మూవీ ఆగస్టు 12కు వాయిదా పడింది. నాగచైతన్య థాంక్యూ సినిమా రిలీజ్ నేపథ్యంలో దిల్ రాజు కోరగా పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆగస్టు 12 నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ రిలీజ్ కానుంది. దీంతో వీరిద్దరి సినిమాల మధ్య పోటీ ఉండనుంది. ఇప్పటికే ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా, ఆగస్టు 13న స్వాతిముత్యం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.