‘కుక్క’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభలనూ కుదిపేశాయి. ‘‘ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ నేతలు చాలా త్యాగాలు చేశారు. కానీ బీజేపీ నుంచి ఒక కుక్క కూడా చనిపోలేదు. మోదీ ప్రభుత్వం సింహంలా పనిచేస్తుందని చెబుతున్నారు. ఎలుకలా కూడా పని చేయటం లేదు.’’ అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.