ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ముమ్మరం
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దర్యాప్తు వేగం కానుంది. ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా అందుకు సంబంధించిన ప్రతులు వెలువడ్డాయి. అవి దిల్లీలో కార్యాలయానికి చేరుకోగానే దర్యాప్తు అధికారిని నియమిస్తారు.దీంతో ఒకట్రెండు రోజుల్లో సీబీఐ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. మెుదట ఎవర్ని పిలిచి ప్రశ్నిస్తారనే విషయంలో చర్చ జరుగుతోంది. ఈ కేసులో రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు నిందితులుగా ఉన్నారు.