మెగాస్టార్,అమీర్‌ఖాన్‌తో నాగార్జున కింగ్‌సైజ్ ఇంటర్వ్యూ
అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నాడు. నాగచైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున అమీర్‌ఖాన్, చిరంజీవి, నాగచైతన్యను ఇంటర్వ్యూ చేశాడు. సినిమా విశేషాలతో పాటు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సరదాగా ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. త్వరలో పూర్తి ఇంటర్వ్యూ విడుదల కానుంది.