• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గర్భిణీల పౌష్ఠికాహారంలో చనిపోయిన పాము

    టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాము కళేబరమున్న ఖర్జూరాల్ని గర్భిణులకు పంపిణీ చేశారని ఆరోపించారు. సైకో జగన్‌ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చిన ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్న ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము బయటపడినట్లు పేర్కొన్నారు. https://x.com/naralokesh/status/1712295250071310554?s=20

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్

    సీఐడీ ముందు రెండో రోజు విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌ను నిన్న ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు లోకేష్ రానున్నారు. మరోవైపు నిన్న జరిగిన విచారణలో కేసుతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు అడిగారని ఆరోపించారు.

    దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదు: లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. నన్ను సీఐడీ 50 ప్రశ్నలు అడిగింది. అందులో ఈ కేసులో నేను ఎలా లాభపడ్డానో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కక్ష సాధింపు కోసమే నాపై ఎలాంటి ఆధారాలు లేని కేసు పెట్టారు. మళ్లీ రావాలని … Read more

    నేడు ఈడీ ఎదుట నవదీప్ హాజరు

    హైదరాబాద్‌- నేడు ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. మధాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు పరిచయాలు ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. వీరితో జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

    సిట్ ఆఫీస్‌కు నారా లోకేష్

    కాసేపట్లో సిట్ ఆఫీసుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను విచారించనున్నారు. ఐఆర్‌ఆర్‌ కేసులో ఏ-14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. మంత్రిగా లోకేష్ ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

    బండారు అరెస్టును ఖండించిన లోకేశ్‌

    AP: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నేతలంతా కూసే బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి?. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారుని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైకాపాకు ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?’ అని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా నిలదీశారు.

    నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి!

    ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లోకేశ్‌పై కోడిగుడ్డు విసరగా భద్రతా సిబ్బందికి తగిలింది. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై లోకేశ్ అక్కడే కూర్చుని నిరసనకు దిగారు. #WATCH | Andhra Pradesh | … Read more

    లోకేశ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

    తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన [యువగళం](url) పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. లోకేశ్ ఉపయోగిస్తున్న వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత పోలీసులు రథాన్ని విడిచిపెట్టారు. ప్రచార వాహనాలను సీజ్ చేయటంతో పోలీసులను ప్రశ్నించిన … Read more

    ప్రజలతో కొట్టిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యలు

    ఏపీ మంత్రి రోజా తెలుగుదేశం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లడితే ఊరుకునేదని లేదని, ప్రజలతో కొట్టిస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా, టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల గురించి చర్చిస్తున్నారని, అసలు జాబ్స్ గురించి అడిగే అర్హత టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు.