ఆర్టెమిస్ 1 ప్రయోగం ఇంకా ఆలస్యం!
నాసా ప్రయోగించడానికి సిద్ధం చేసిన ‘ఆర్టెమిస్ 1’ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్లోని ఇంజిన్లో సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. దీనిపై సిబ్బంది పనిచేస్తున్నారని, సమస్య పరిష్కారం తర్వాత తిరిగి ప్రయోగించనున్నట్లు నాసా తెలిపింది. మంగళవారం ప్రయోగించవచ్చని భావిస్తున్న తరుణంలో ఇయాన్ హరికేన్ ప్రభావంతో మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆగస్టులో జరగాల్సిన ఈ ప్రయోగం 2 సార్లు వాయిదా పడింది. చంద్రునిపైకి మానిషిని పంపే ప్రాజెక్టులో భాగంగా ఆర్టిమిస్ 1ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది.